: 300 మందిని సముద్రంలోకి తోసేసిన స్మగ్లర్లు!


పొట్టచేతపట్టుకుని దేశాలు దాటుతున్న వలసదారులపై స్మగ్లర్ల దురాగతాలు శ్రుతిమించుతున్నాయి. అంతర్యుధ్ధం, ఆటుపోట్లు, భవిష్యత్ పై ఆశలతో దేశాలు దాటిపోతున్నవారిని నిర్దాక్షిణ్యంగా సముద్రంలో తోసేసిన ఘటన వెలుగు చూసింది. ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇథియోపియా, సోమాలియా దేశాల నుంచి 300 మంది వలసదారులు యెమన్ తీరం ద్వారా షబ్వా వెళ్లేందుకు స్మగ్లర్ల పడవల ద్వారా ప్రయత్నించారు.

 అయితే అరేబియా సముద్రంలోకి ప్రవేశించిన స్మగ్లర్లు తమను ఎవరైనా గుర్తిస్తారేమోనన్న భయంతో పడవల్లోని 300 మందిని సముద్రంలోకి తోసేశారు. దీంతో 56 మంది మృత్యువాతపడగా, మరో 35 మంది గల్లంతయ్యారు. కాగా, ఈ ఘటనలో ఏదో విధంగా ప్రాణాలతో బయటపడినవారు షబ్వా వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. 

  • Loading...

More Telugu News