: జగన్‌నే ల‌క్షసార్లు ఉరితీయాలి: టీడీపీ ఎమ్మెల్సీ అన్నం స‌తీశ్


నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ప‌ట్ల టీడీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ రోజు గుంటూరులో టీడీపీ ఎమ్మెల్సీ అన్నం స‌తీశ్ మాట్లాడుతూ... జ‌గ‌న్ మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యారని, ఆయ‌న చేస్తోన్న‌ వ్యాఖ్య‌లు ఆయ‌న దిగ‌జారుడుత‌న‌నానికి నిద‌ర్శ‌నమ‌ని వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఉరితీసినా త‌ప్పులేద‌ని జ‌గ‌న్ ఈ రోజు వ్యాఖ్య‌లు చేశార‌ని స‌తీశ్ మండిప‌డ్డారు. జ‌గ‌న్‌నే ల‌క్ష‌సార్లు ఉరితీయాల‌ని అన్నారు. 

  • Loading...

More Telugu News