: తెలంగాణ వచ్చింది మేము చావడానికా?: నేరెళ్ల బాధితుల ఆవేదన


పోలీసుల తీరుపై నేరెళ్ల బాధితులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది తాము చావడానికా? అని వారు ప్రశ్నించారు. నేరెళ్ల ఘటనపై ఈ రోజు హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, వామపక్ష నేతలు, జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలకు బాధితులు తమ ఆవేదనను తెలియజేశారు.

  • Loading...

More Telugu News