: 40 రోజుల తర్వాత వచ్చి, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు: కేటీఆర్ పై రేవంత్ ఫైర్
మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నేరెళ్ల ఘటన జరిగిన 40 రోజుల తర్వాత తీరిగ్గా వచ్చి బాధితులను పరామర్శించారని మండిపడ్డారు. ఇన్ని రోజులు స్పందించకుండా ఉండి, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తూ, దోపిడీ చేస్తుంటే దాన్ని ఇసుక మాఫియా అనకుండా మరేమంటారని ప్రశ్నించారు. మైనింగ్ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు ఇసుక మాఫియాను కట్టడి చేయాల్సిన బాధ్యత లేదా? అని అడిగారు. విదేశాల్లో చేస్తున్న వ్యాపారాలకు అడ్డు తగిలారనే నేరెళ్లలోని దళితులను చితకబాదారని ఆరోపించారు.