: చంద్రబాబుకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: నంద్యాలలో జగన్


నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్ర‌చారం కొన‌సాగిస్తోంది. నంద్యాలలో రోడ్ షోలు నిర్వ‌హిస్తోన్న జ‌గ‌న్ ఈ రోజు గోస్పాడు మండ‌లం దీబ‌గుంట్లలో మాట్లాడుతూ... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. హామీలు నెర‌వేర్చ‌ని చంద్ర‌బాబుకు ఉరిశిక్ష వేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నిక‌ల‌కు ఈ అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గ ఉప ఎన్నిక నాంది కావాల‌ని, వైసీపీని గెలిపించాల‌ని అన్నారు. నంద్యాల ప్ర‌జ‌లు వేసే ఓటు చంద్ర‌బాబు గూబ గూయ‌మ‌ని అనిపించాల‌ని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌ధాని మోదీ కాళ్ల‌వద్ద తాక‌ట్టుపెట్టాడ‌ని అన్నారు. ప్రత్యేక హోదాపై నిర్ల‌క్ష్యం వ‌హించార‌ని అన్నారు.  

  • Loading...

More Telugu News