: మహిళా ఎగ్జిక్యూటివ్ వెంటపడి యువకుల వేధింపులు!


ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లో ఓ మహిళపై జరిగిన వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటనలో కేసు నమోదు చేసేందుకు పోలీసులు వంకలు చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... గురుగ్రామ్ లోని సెక్టార్ 18లో గల ఆఫీస్ నుంచి మహిళా ఎగ్జిక్యూటివ్ (25) తన ఇంటికి స్కూటర్ పై బయల్దేరారు. ఇంతలో కారులో ఇద్దరు యువకులు ఆమెను వెంబడించడం ప్రారంభించారు.

రోడ్డు నిర్మానుష్యంగా ఉండడంతో బైక్ ఆపాలని పదేపదే అరిచి వేధింపులకు దిగారు. ఓల్డ్ ఢిల్లీ-గురుగ్రామ్ రోడ్డు సమీపంలో అతుల్ కటారియా రోడ్డు వరకు వారి వేధింపులు ఆగలేదు. ఈ చౌరస్తాలో కారుతో బైక్ ను కార్నర్ చేసి, ఆమెను కిందపడేయాలని చూడడం విశేషం. అయితే వారి ఉధ్దేశం గ్రహించిన ఆమె వేగంగా బండి నడుపుతూ ఇంటికి చేరుకున్నారు. అనంతరం సెక్టార్ 14లోని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఘటన సెక్టార్ 18లో జరగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సలహా ఇచ్చారు. దీంతో ఆమె నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మార్గంలోని సీసీ పుటేజ్ ను పరిశీలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News