: రోడ్ షోలో జగన్ కు బ్రహ్మరథం పడుతున్న అభిమానులు!


నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ప్రచారపర్వం రెండో రోజు కొనసాగుతోంది. ఈ ఉదయం నూనెపల్లి నుంచి రోడ్ షోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ కు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. జగన్ పై పూలు చల్లుతూ, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా అందరిని పలకరిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. శిల్పాకు వేస్తున్న ఓటు తనకే వేస్తున్నట్టు ఓటర్లు భావించాలని విన్నవించారు. ఇన్ని రోజులు డబ్బుల్లేవంటూ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయని చంద్రబాబు... ఇప్పుడు ఉప ఎన్నిక రావడంతో హడావుడిగా పనులు మొదలు పెట్టారని విమర్శించారు. 

  • Loading...

More Telugu News