: ఫుట్ బాల్ టోర్నీ ప్రారంభం కాకుండానే టాటూతో భారత ఫుట్ బాల్ అభిమానులను చిత్తు చేసిన అర్సనల్ స్టార్!
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నీ ఇంకా ప్రారంభం కాకుండానే అర్సెనల్ క్లబ్ ప్లేయర్ థియో వాల్కాట్ భారతీయ ఫుట్ బాల్ అభిమానులను ఒక్క టాటూతో చిత్తుచేశాడు. భారత్ లో పరమశివుడ్ని అభిమానించని భక్తుడు ఉండడు. అయితే అర్సెనల్ కు చెంది థియో వాల్కాట్ తన వీపుపై ఓం నమఃశివాయః అన్న టాటూను వేయించుకున్నాడు.
ఈ టాటూ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన థియో వాల్కాట్... మీ మనసును తెరవండి, భయాన్ని వదలండి, ద్వేషించినా, ఈర్ష్య పడినా...మీరు మాత్రం సంబరాన్ని సంతోషంగా ఆస్వాదించండి అంటూ ట్వీట్ చేశాడు. ఇది భారత ఫుట్ బాల్ అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడిది వైరల్ అయింది. దానిని మీరు కూడా చూసి ఆస్వాదించండి.