: పంద్రాగస్టు ముందు కలకలం... రైలు పేల్చేందుకు కుట్ర... తప్పిన పెను ముప్పు!


70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకోవడానికి భారత్ సన్నద్ధమవుతున్న వేళ, విధ్వంసం సృష్టించేందుకు ముష్కర మూక పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. అమృతసర్ వెళుతున్న ఓ రైలులోని టాయిలెట్ లో బాంబును అమర్చగా, దాన్ని అమేథి రైల్వే స్టేషన్ లో పసిగట్టి డీ యాక్టివేట్ చేశామని ఎస్పీ సౌమిత్రా యాదవ్ వెల్లడించారు. అకల్ తాఖత్ ఎక్స్ ప్రెస్ (12317)లోని టాయిలెట్ లో తాడు చుట్టిన ఓ వస్తువును చూసినట్టు ఫిర్యాదు రావడంతో రైలును ఆపి, రెండు బోగీలను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టామని, ఇది స్వల్ప ప్రభావాన్ని చూపే బాంబుగా గుర్తించామని ఆయన అన్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీల తరువాత రైలు తిరిగి ప్రయాణమైందని అన్నారు. బాంబు సమీపంలోని ఓ లేఖ ప్రకారం, లష్కరే తోయిబా ఉగ్రవాది అబూ దుజానా ఎన్ కౌంటర్ పై పగ తీర్చుకునేందుకు బాంబును అమర్చినట్టు తెలుస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News