: టాలీవుడ్ డ్రగ్స్ దందాపై నిర్మాత దగ్గుబాటి సురేశ్ తాజా కామెంట్స్!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం ఉంటే తప్పకుండా సరిచేసుకుంటామని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీవెంకటేశ్వరుని దర్శించుకున్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, స్కూల్ పిల్లలకు డ్రగ్స్ చేరకుండా, రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని సూచించారు. మత్తుమందుల వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపట్టే కార్యక్రమాల్లో తెలుగు సినీ పరిశ్రమ ముందుంటుందని, పెద్దలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.