: మద్రాస్ హైకోర్టులో సినీ నటి కాజల్‌కు చుక్కెదురు.. వాణిజ్య ప్రకటన కేసులో పిటిషన్ కొట్టివేత!


వీవీడీ కొబ్బరి నూనె సంస్థ తనతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను తనకు రూ.2.50 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ సినీ నటి కాజల్ అగర్వాల్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆ సంస్థ ప్రకటనల్లో నటించేందుకు కాజల్ 2008లో ఒప్పందం కుదుర్చుకుంది. తాను నటించిన ప్రకటనను ఏడాదిపాటే  ప్రసారం చేయాలని ఈ సందర్భంగా కాజల్ నిబంధన విధించింది. అయితే ఆ ప్రకటన ఆ తర్వాత కూడా కొనసాగడంతో 2011లో మద్రాస్ హైకోర్టులో కాజల్ కేసు వేసింది. ఆ ప్రకటనను తక్షణం నిలిపివేయించాలని, ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను తనకు రూ.2.50 కోట్లు చెల్లించాలని సదరు సంస్థను ఆదేశించాలని కోరింది.

కాజల్ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆమె అభ్యంతరాలను కొట్టివేసింది. చట్టప్రకారం ఆ ప్రకటన కాపీ రైట్స్ దానిని రూపొందించిన సంస్థకే చెందుతాయని పేర్కొంది. ఆ ప్రకటనను ఒక్క ఏడాదే ప్రసారం చేయాలనే హక్కు కాజల్‌కు ఉండబోదని, వాణిజ్య ప్రకటన ప్రమోషన్ హక్కులు ఆ సంస్థకు 60 ఏళ్ల వరకు ఉంటాయని న్యాయమూర్తి జస్టిస్ టి.రవీంద్రన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News