: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి!


గన్ కల్చర్ పట్టి పీడిస్తోన్న అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. షికాగో నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన కాల్పుల్లో ఒక‌రు మృతి చెంద‌గా మ‌రో ఆరుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. రోడ్డు పక్కన వెళ్తున్న వారిపై ప‌లువురు వ్య‌క్తులు విచక్షణ రహితంగా కాల్పులు జ‌రిపి పారిపోయార‌ని అక్క‌డి అధికారులు చెప్పారు. షికాగో పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన ఓ యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినా లాభం లేకుండా పోయింద‌ని, చికిత్స పొందుతూ స‌ద‌రు వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు చెప్పారు.    

  • Loading...

More Telugu News