: సాధారణ దుస్తుల్లో కూడా అందం ఉంటుంది!: హీరోయిన్ కేథరీన్


సాధారణ దుస్తుల్లో కూడా అందం ఉంటుందని ప్రముఖ సినీ నటి కేథరీన్ తెలిపింది. తెలుగు సినిమాల్లో తాను గ్లామర్ పాత్రలు పోషించానని చెప్పింది. అయితే తన తొలి తమిళ సినిమాలో సాధారణ దుస్తులే ధరించానని, కనీసం మేకప్ కూడా వేసుకోలేదని చెప్పింది. అయితే తమిళ ప్రేక్షకులు సాధారణ దుస్తుల్లో కూడా అందంగా ఉన్నానని చెప్పారని తెలిపింది. ఆ సినిమా విజయం సాధించడంతో తనకు బెస్ట్ డెబ్యూ ఫీమేల్ గా అవార్డు కూడా ఇచ్చారని చెప్పింది.

దీంతో, హీరోయిన్ అంటే గ్లామరస్ గా మాత్రేమే కనిపించాల్సిన అవసరం లేదని తనకు అర్ధమైందని చెప్పింది. తనకు వచ్చిన అవకాశాల్లో నచ్చినవి మాత్రమే ఎంచుకుని నటిస్తున్నానని చెప్పింది. తన పాత్ర వరకే తనకు సంబంధం ఉంటుందని, సినిమాలో తనతో ఎంత మంది హీరోయిన్లు నటిస్తున్నారన్నది చూడనని చెప్పింది. పాత్ర నచ్చితే, విభిన్నంగా ఉంటే, పేరు తెచ్చేలా ఉందనిపిస్తే ఎవరైనా సరే నటించేందుకు మొగ్గు చూపుతారని తెలిపింది. ఇక గ్లామర్ కి, ఎక్స్ పోజింగ్ కి మధ్య సన్నని గీత ఉంటుందని చెప్పింది. అది తెలుసుకుంటే సమస్య ఉండదని అభిప్రాయపడింది. ఒక పాత్రను అంగీకరించిన తరువాత, ఇక ఏ కష్టమొచ్చినా నటించకతప్పదని తెలిపింది. 

  • Loading...

More Telugu News