: పోలీసు విచారణకు సహకరించని విక్రమ్ గౌడ్!
కాల్పుల కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ను నేడు పోలీసులు ఒక్క రోజు కస్టడీకి తీసుకున్నారు. కాసేపటి క్రితమే కస్టడీ ముగిసింది. అయితే, పోలీసుల విచారణకు విక్రమ్ గౌడ్ ఏ మాత్రం సహకరించలేదని తెలుస్తోంది. విక్రమ్ గౌడ్ తో పాటు మరో ముగ్గురుని కూడా పోలీసులు విచారించారు. వాస్తవానికి ఐదు రోజుల కస్టడీకి విక్రమ్ గౌడ్ ను ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే, న్యాయస్థానం ఒక్క రోజు కస్టడీకి మాత్రం అనుమతించింది. ఒక రోజు ముగిసిపోవడంతో విక్రమ్ గౌడ్ ను తిరిగి జైలుకు తీసుకెళ్లారు పోలీసులు.