: బాలీవుడ్ సినిమాలో బాబా రామ్‌దేవ్?
ఆగస్టు 18న విడుదల కానున్న `యే హై ఇండియా` చిత్ర ప్రచార కార్యక్రమాల్లో యోగా గురువు బాబా రామ్‌దేవ్ జోరుగా పాల్గొంటున్నారు. ఈ సినిమాతో ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సినిమాలోని `సయ్యా సయ్యా` అనే పాటలో ఆయన కొద్దిసేపు కనిపించనున్నారు. లోమ్ హర్ష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గావీ చాహల్, డియానా ఉప్పల్‌లు నటించారు. `ఈ సినిమాలో భారతదేశ సామర్థ్యం గురించి చక్కగా చూపించారు. ఆ విధానం నాకు బాగా నచ్చింది. అందుకే బాగా ఆలోచించి ఈ సినిమాకు ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నాను.` అని బాబా రామ్‌దేవ్ తెలిపారు. తమ చిత్రానికి బాబా రామ్‌దేవ్ కంటే గొప్ప ప్రచారకర్త దొరకడని, ఆయన మద్దతు తెలుపుతున్నందుకు రుణపడి ఉంటానని చిత్ర దర్శకుడు లోమ్ హర్ష్ చెప్పాడు.