: వృద్ధులకు భారత్ శ్రేయస్కరం కాదు... వెల్లడించిన ఫ్రెంచ్ నివేదిక
పదవీ విరమణ అయిన తర్వాత అందే సౌకర్యాల విషయంలో వృద్ధుల జీవనానికి భారత్ శ్రేయస్కరం కాదని ఫ్రాన్స్‌కు చెందిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ నాటిక్సిస్ గ్లోబల్ సంస్థ ప్రచురించిన నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో బ్రిక్స్ ఐదు దేశాల్లో భారత్ చివరి స్థానంలో నిల్చినట్లు నివేదిక పేర్కొంది. అలాగే మొత్తం 43 దేశాల్లో అధ్యయనం చేసి తయారు చేసిన ఈ నివేదికలో భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. రిటైర్మెంట్ తర్వాత కల్పించే సౌకర్యాలు, ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్య సదుపాయాలు, జీవన భద్రత వంటి నాలుగు అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ జాబితాలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ దేశాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదికలో గతేడాది కూడా భారత్ చివరి స్థానంలో నిలిచింది.