: ఆయనకు ఆవేశం తప్ప.. ఆలోచన, అవగాహన లేవు: జగన్ పై వర్ల రామయ్య కామెంట్


వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఆయనకు ఆవేశమే తప్ప ఆలోచన, అవగాహన లేవని అన్నారు. ఎన్నికల  సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నంద్యాల సభలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో... ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన వివరణలో కూడా జగన్ అబద్దాలే చెప్పారని అన్నారు. జగన్ ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మరని చెప్పారు. వైసీపీ అంటేనే ఉన్మాదుల పార్టీ అని, ఆ పార్టీ అధ్యక్షుడితో పాటు ఇతర నాయకులంతా ఉన్మాదులేనని విమర్శించారు.

  • Loading...

More Telugu News