: గువాం ద్వీపంపైకి దూసుకెళ్లి చక్కర్లుకొట్టిన అమెరికా యుద్ధవిమానాలు


పసిఫిక్ మహా సముద్రంలోని అమెరికా అధీనంలో ఉన్న గువాం ద్వీపంపై భీక‌ర‌దాడికి దిగుతామంటూ ఉత్తర కొరియా చేసిన ప్ర‌క‌ట‌న‌తో అమెరికా అప్ర‌మ‌త్త‌మైంది. గువాం ద్వీపం మీదుగా అమెరికా యుద్ధవిమానాలు దూసుకెళ్లాయి. రెండు రోజుల క్రిత‌మే భేటీ అయిన అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లు అందులో కీల‌క‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్ర‌కార‌మే సుమారు 10 గంటల పాటు అమెరికాకు చెందిన సూపర్‌ సోనిక్‌ బాంబర్‌ జెట్లు గువాం మీదుగా దూసుకెళ్లి చక్కర్లుకొట్టాయి.

ఉత్త‌ర‌కొరియా హెచ్చ‌రిక‌ల‌పై స్పందించిన అమెరికన్ ఎయిర్‌ఫోర్స్... ఏదైనా దాడి జ‌రపాల‌ని చూస్తే దాన్ని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపింది. ఇటీవ‌ల ఉత్త‌ర‌కొరియాపై ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు ఉత్త‌ర‌కొరియాను మ‌రింత రెచ్చ‌గొట్టాయి. గువాంపై దాడి చేసేందుకు ఆ దేశం సుమారు 60 న్యూక్లియర్‌ వార్ హెడ్‌లను సిద్ధం చేసిందని అమెరికా అనుమానం వ్య‌క్తం చేస్తోంది. 

  • Loading...

More Telugu News