: జలాంతర్భాగ పరిశోధనకు మ్యాన్డ్ సబ్‌మెర్సిబుల్ తయారుచేసిన చెన్నై శాస్త్రవేత్తలు
చెన్నైకి చెందిన ఎస్సో- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) శాస్త్రవేత్తలు జలాంతర్భాగ పరిశోధనలకు ఉపయోగపడే మ్యాన్డ్ సబ్‌మెర్సిబుల్ వాహనాన్ని తయారు చేశారు. ముగ్గురు ప్రయాణించగల ఈ వాహనం రూపకల్పనకు సంబంధించిన ప్రాథమిక డిజైన్‌ను వారు అభివృద్ధి చేశారు. దీని సహాయంతో సముద్రంలో 6 కి.మీ. లోతు వరకు ప్రయాణించి పరిశోధన చేయవచ్చు. ఈ ప్రాజెక్టు రూపకల్పన అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ అంగీకారం కోసం ఎన్ఐఓటీ శాస్త్రవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. రూ. 500 కోట్ల బడ్జెట్‌తో వచ్చే ఐదేళ్లలో ఈ వాహనాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇస్రో, డీఆర్‌డీఓ, ఐఐటీ శాస్త్రవేత్తలతో కలిసి ఈ మ్యాన్డ్ సబ్‌మెర్సిబుల్ నిర్మాణాన్ని చేపడతామని ఎన్ఐఓటీ డైరెక్టర్ సతీశ్ షెనాయ్ తెలిపారు. ఈ వాహనంతో పాటు ఒక్కసారి సముద్రంలోకి వెళ్తే 8 నుంచి 10 గంటలపాటు నిర్విరామంగా జలాంతర్భాగాన్ని పరిశోధించవచ్చని ఆయన వివరించారు.