: మహిళా ప్యాసింజర్ ను చూస్తూ పాడు పనులు చేసిన ఓలా డ్రైవర్ అరెస్ట్


ప్రముఖ క్యాబ్స్ సేవల సంస్థ ఓలాకు చెందిన ఓ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించిన కేసులో నేడు అరెస్టయ్యాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ముంబైకి చెందిన ఓ మహిళ, తన ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఓ క్యాబ్ ను బుక్ సుకుంది. క్యాబ్ లో ఎక్కిన తరువాత ఆమెనే తదేక దృష్టితో చూస్తూ డ్రైవర్ వికృత చర్యలకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన ఆమె, వెంటనే క్యాబ్ ను ఆపి కారు దిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఓలాకు చెందిన ఓ డ్రైవర్, తెలుగు డాక్టర్ ను కిడ్నాప్ చేసి కోట్ల రూపాయల డబ్బును డిమాండ్ చేసిన విషయాన్ని మరువక ముందే మరో డ్రైవర్ దురాగతం వెలుగులోకి రావడం గమనార్హం.

  • Loading...

More Telugu News