: ప్రీపెయిడ్ వినియోగదారులకు వొడాఫోన్ `సూపర్ అవర్` ప్లాన్... ఇంకా మరెన్నో!
తమ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం వొడాఫోన్ ప్రత్యేకంగా రూ. 7 రీచార్జీతో `సూపర్ అవర్` ప్లాన్‌ను ప్రవేశ పెట్టింది. ఈ ప్లాన్ ద్వారా ఒక గంట పాటు వొడాఫోన్ టు వొడాఫోన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అలాగే గంటపాటు 3జీ లేదా 4జీ అన్‌లిమిటెడ్ డేటాను కూడా అందిస్తోంది. దీంతో పాటు రూ. 21 ప్లాన్‌ను కూడా వొడాఫోన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా కూడా గంటపాటు 3జీ లేదా 4జీ డేటాను అన్‌లిమిటెడ్‌గా వాడుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లు ఇప్పటికే అన్‌లిమిటెడ్ ప్లాన్ వాడుతున్న వినియోగదారులకు వర్తించవు.
ఇంకో విషయం ఏంటంటే... ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్, బిహార్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్ర వినియోగదారులకు అందుబాటులో లేదు. ఈ ఆఫర్ డిసెంబర్ 1, 2017 వరకు అమల్లో ఉండనుంది. ఇటీవల రూ. 244 ప్లాన్‌ను కూడా వొడాఫోన్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా 70 రోజుల పాటు ప్రతిరోజు 1జీబీ 3జీ లేదా 4జీ డేటాతో పాటు వొడాఫోన్ టు వొడాఫోన్ అన్‌లిమిటెడ్ కాల్స్‌ను అందజేస్తుంది. కాకపోతే ఇది కొత్తగా వొడాఫోన్ వినియోగిస్తున్న వారికే అందుబాటులో ఉంది. అలాగే రూ. 346 ప్లాన్ ను కూడా వొడాఫోన్ అందుబాటులో తెచ్చింది.