: శ్రీకాకుళం జిల్లాలో మాజీ ప్రేమికుల దారుణ హత్య.. పెళ్లయినా ప్రేమ బంధాన్ని వదులుకోకపోవడమే కారణమని అనుమానాలు!
శ్రీకాకుళం జిల్లా గారమండలంలోని కొమరివానిపేటలో ఇద్దరు మాజీ ప్రేమికులు దారుణహత్యకు గురయ్యారు. మృతులను కామేశ్వరరావు, దివ్యగాయత్రిగా పోలీసులు గుర్తించారు. గతంలో వీరిద్దరు ప్రేమించుకున్నారని, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అయితే పెళ్లయిన తర్వాత కూడా వీరు ప్రేమ బంధాన్ని వదులుకోలేకపోయారు. దీంతో ఇద్దరూ తరచూ కలుసుకునే వారని చెబుతున్నారు. కాగా, ఈ హత్యల వెనక దివ్యగాయత్రి బంధువుల హస్తం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.