: భారత్ లో షియోమి నుంచి విడుదల కానున్న మరో స్మార్ట్ ఫోన్.. ప్రత్యేక ఆకర్షణగా డ్యూయల్‌ కెమెరా!


ప్రముఖ మొబైల్‌ తయారీదారీ సంస్థ‌ షియోమి భార‌త మార్కెట్లోకి మ‌రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయ‌నుంది. డ్యూయల్‌ కెమెరాతో రానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఏ మోడ‌ల్ అన్న అంశాన్ని గురించి ఆ సంస్థ ప్రతినిధులు వెల్ల‌డించ‌లేదు. అయితే, ఈ మొబైల్ ఎంఐ 5ఎక్స్ మోడ‌ల్  అయి ఉంటుందని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ మొబైల్‌ను త‌మ దేశంలో షియోమి గ‌త నెల‌లో విడుదల చేసింది. ఈ మోడ‌ల్ నే వ‌చ్చేనెల భార‌తీయ మార్కెట్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీని ధర రూ.14,200 వుంటుంది.

 ఎంఐ 5ఎక్స్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్లు...

  •  5.5అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌
  •  12 మెగాపిక్సల్ తో రెండు వెనుక‌ కెమెరాలు
  •  5 మెగాపిక్స‌ల్ ముందు కెమెరా
  •  4జీబీ ర్యామ్‌
  •  ఆండ్రాయిడ్‌ 7.0 నూగట్‌ ఓఎస్  
  •  64జీబీ అంతర్గత స్టోరేజీ
  •  3,080 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యం.

  • Loading...

More Telugu News