: గతంలో ఎన్టీఆర్ నన్ను టీడీపీలోకి ర‌మ్మన్నారు: వెంక‌య్య నాయుడు


గతంలో ఎన్టీఆర్ తనను టీడీపీలోకి ర‌మ్మన్నారని, కానీ తాను వెళ్ల‌లేద‌ని ఉప రాష్ట్ర‌పతిగా ఎన్నికైన వెంక‌య్య నాయుడు అన్నారు. వెంక‌య్య నాయుడు గ‌తంలో చేసిన ప్ర‌సంగాల‌ సారాంశాలతో ‘అలుపెరుగని గళం - విరామమెరుగని పయనం’ పేరుతో రూపొందించిన పుస్తకాలను ఈ రోజు హైద‌రాబాద్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య మాట్లాడుతూ.. వారసత్వం లేకున్నా జవసత్వంతో బీజేపీలోకి వచ్చి ఎదిగాన‌ని అన్నారు. 2019లో మోదీని మరోసారి ప్రధానిగా చూసి రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని అనుకున్నాన‌ని అన్నారు. తాను కోరని పదవులను కూడా బీజేపీ త‌న‌కు ఇచ్చిందని చెప్పారు. వ్య‌క్తిగ‌త ద్వేషం, దూష‌ణ అల‌వాటు చేసుకోలేదని, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌ర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. 

  • Loading...

More Telugu News