: పామును చంకలో పెట్టుకొని రైల్లో కూర్చున్న ప్రయాణికుడు... మీరూ చూడండి!
ఓ ప్రయాణికుడు పామును చంకలో పెట్టుకొని రైలెక్కి కూర్చోగా తీసిన ఓ దృశ్యం ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. మాస్సాచుస్సెట్స్‌లోని బోస్టన్‌లో ఓ వ్యక్తి ఎంచక్కా ఓ పామును తన చంకలో పెట్టుకుని కూర్చోగా ఒక్కసారిగా ఆ పాము కదులుతూ ముందుకు వచ్చేసింది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు తన కెమెరాలో ఈ దృశ్యాన్ని బంధించాడు. ఆ ప్రయాణికుడి చుట్టు ఉన్నవాళ్లంతా భయంతో వణికిపోయారు. పామును బాక్స్‌లో పెట్టి జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సిందిపోయి ఇలా కుక్కపిల్లను తీసుకెళుతున్నట్లు చంకలో పెట్టి తీసుకెళుతున్నాడేంటంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి..