: దేశంలో ఇదే పెద్ద స్కాం... నోట్ల రద్దు ఎందుకు జరిగిందో ఇప్పుడు అర్థమైంది!: కేంద్రాన్ని నిలదీసిన కపిల్ సిబాల్
కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దును ఎందుకు చేపట్టిందో ఇప్పుడు అర్థమైందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో వ్యాఖ్యానించింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా 500 రూపాయల నోట్లపై పెను దుమారం రేగింది. దేశంలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా 500 రూాపాయల నోట్లను రెండు డిజైన్లతో పాటు రెండు సైజుల్లో ఎందుకు వినియోగంలోకి తెచ్చారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని నిలదీసింది. దేశంలో ఇదే అతిపెద్ద కుంభకోణమని తెలిపింది.
పార్టీ కోసం ఒక డిజైన్ 500 రూపాయలను, ప్రజల కోసం మరొక డిజైన్ 500 రూాపాయల నోట్లను వినియోగంలోకి తెచ్చారని మండిపడింది. ఈ మేరకు రెండు డిజైన్లు, రెండు సైజులు గల 500 రూపాయల నోట్లను కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించింది. ఇన్నేళ్లలో ఇలాంటి స్కాం చేసే ధైర్యం ఎవరూ చేయలేదని ఆయన విమర్శించారు. కపిల్ సిబాల్ ఆరోపణలకు తృణమూల్, జేడీయూలు మద్దతు తెలుపగా, భారీ స్థాయిలో నోట్లు ముద్రించినప్పుడు ఒకటీ అరా డిజైన్లు, సైజులు మారుతాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తోంది.