: మహేశ్ ఇంట రాఖీ సందడి... గౌతమ్కి రాఖీ కట్టిన చిన్నారి సితార
మహేశ్ బాబు గారాల పట్టి చిన్నారి సితార సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయింది. ఆమెకు సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతాయి. అలాగే రక్షా బంధన్ సందర్భంగా సితార తన అన్న గౌతమ్కి రాఖీ కట్టిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. తమ ఇంట్లో జరిగిన రాఖీ వేడుకల ఫొటోలను మహేశ్ భార్య నమ్రత తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. గౌతమ్కి రాఖీ కట్టి, తన కాళ్లకు నమస్కరించి, నోట్లో స్వీట్, బహుమతి అందజేసిన ఫొటోలను నమ్రత షేర్ చేసింది. తెలుగు పండగలను మహేశ్ ఇంట్లో జరపడంలో నమ్రత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రాఖీతో పాటు దసరా, దీపావళి, ఉగాది వంటి పండగలను కూడా మహేశ్ ఇంట్లో చక్కగా జరుపుకుంటారు.