: వారి మాటలు నమ్మి మోసపోవద్దు: భూమా బ్రహ్మానందరెడ్డి


నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా వైసీపీపై టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విరుచుకుపడ్డారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆయన ఆరోపించారు. నంద్యాల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందని... ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. అభివృద్ధి నిరోధకుల మాటలను నమ్మి మోసపోవద్దని ఓటర్లకు సూచించారు. మరోవైపు, ఎన్నికల ప్రచారాన్ని టీడీపీ, వైసీపీలు ముమ్మరం చేశాయి. గడపగడపకూ వెళ్లి ఓట్ల కోసం ప్రజలను అభ్యర్థిస్తున్నాయి.

  • Loading...

More Telugu News