: టీడీపీకి సవాల్ విసిరిన వైసీపీ నేత పెద్దిరెడ్డి!
ప్రజాస్వామిక విలువలకు వైసీపీ ప్రాధాన్యతను ఇస్తుందని... అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరారని ఆ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. స్పీకర్ ఫార్మాట్ లోనే చక్రపాణి రెడ్డి రాజీనామా చేశారని చెప్పారు. 20 మంది పార్టీ ఫిరాయింపుదారులతో చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏమాత్రం ప్రజాస్వామిక విలువలు ఉన్నా... ఫిరాయింపుదారులతో వెంటనే రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద చంద్రబాబుకు నమ్మకం లేదని అన్నారు. ఎన్నికలు రాగానే హడావుడిగా అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేసి, తామేదో చేస్తున్నట్టు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.