: అలాంటి బోయ్ ఫ్రెండే ఉంటే.. నాకెందుకింత కష్టం?: రకుల్ ప్రీత్ సింగ్


ఒక యంగ్ హీరో తనకు ఇల్లు కొనిచ్చాడనే వదంతులు తనను ఆవేదనకు గురి చేశాయని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. వాస్తవానికి ఆ వార్తను తాను చదవలేదని... తన తండ్రి ఫోన్ చేసి ఈ విషయం గురించి అడిగారని చెప్పింది. ఆ ఇల్లు తాను సొంతంగా కొనుక్కున్నదని... ఇంటికి సంబంధించిన పేపర్ వర్క్, లోన్ వర్క్ అంతా తన తండ్రే చూసుకున్నారని తెలిపింది. తాను కోటీశ్వరుల కుటుంబంలో పుట్టలేదని... తన తండ్రి జీతం మీదే కుటుంబమంతా ఆధారపడి జీవించేదని... అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన ఓ 24 ఏళ్ల అమ్మాయి సొంతంగా ఇల్లు కొనుక్కుంటే అభినందించాల్సింది పోయి, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా గాసిప్స్ రాశారని ఆవేదన వ్యక్తం చేసింది. మూడు కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనివ్వగలిగే బోయ్ ఫ్రెండే తనకు ఉండి ఉంటే... ఇంత కష్టపడి పని చేయాల్సిన అవసరం తనకు ఎందుకని ప్రశ్నించింది.  

  • Loading...

More Telugu News