: జియోకు షాక్ ఇచ్చిన ముంబై మెట్రోపాలిటన్ కోర్టు


టెలికాం రంగంలో దూసుకుపోతున్న ముఖేష్ అంబానీకి చెందిన జియోకు ఎదురుదెబ్బ తగిలింది. వివరాల్లోకి వెళ్తే, తన ప్రత్యర్థి ఎయిర్ టెల్ పై ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో జియో పిటిషన్ దాఖలు చేసింది. దేశంలోనే అత్యంత వేగవంతమైన నెట్ వర్క్ గా ఎయిర్ టెల్ తన వాణిజ్య ప్రకటనల్లో తప్పుడు ప్రచారం చేసుకుంటోందని... ఇది ముమ్మాటికీ కుట్రపూరితమని, వినియోగదారుల నమ్మకాన్ని వంచించడమే అని పిటిషన్ లో పేర్కొంది. ఎయిర్ టెల్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు... జియో పిటిషన్ ను కొట్టి వేసింది. ఏ సంస్థ అయినా తమ వ్యాపారాలను విస్తరించుకునే క్రమంలో, తమకు నచ్చిన ఉత్తమమైన పద్ధతిలో ప్రకటనలు ఇవ్వొచ్చని ఈ సందర్భంగా కోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News