: 'జై లవ కుశ' నుంచి 'లవ' ఫస్టులుక్ రిలీజ్!


ఎన్టీఆర్ కొత్త లుక్స్ కి ... కొత్త పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన 'జై లవ కుశ' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుంచి 'జై' పాత్రకి సంబంధించిన ఫస్టు లుక్ ను .. టీజర్ ను వదిలారు. ఈ రెండింటికి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో అభిమానులంతా మిగతా రెండు లుక్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 'రాఖీ' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, 'లవ' ఫస్టు లుక్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఎన్టీఆర్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తూ ఆయన అభిమానులను ఆకట్టుకునేలా వున్నాడు. 'లవ'గా ఎన్టీఆర్ మరింత కొత్తగా తెరపై సందడి చేయబోతున్నాడనే విషయం అర్థమవుతోంది. ఇక ఆనవాయితీ ప్రకారం త్వరలో 'లవ' పాత్రకి సంబంధించిన టీజర్ వస్తుంది. అప్పటివరకూ 'లవ' ఫస్టు లుక్ తన ప్రభావం చూపుతూనే ఉంటుందన్న మాట.        

  • Loading...

More Telugu News