: క్యాచ్‌ల వీరుడిగా రహానే రికార్డు.. ఏక్నాథ్ తర్వాత అజింక్యానే!
శ్రీలంకతో కొలంబోలో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 క్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రహానే కేవలం 39 టెస్టుల్లోనే 50 క్యాచ్‌లు అందుకున్నాడు. అతడి కంటే ముందు టీమిండియా మాజీ ఆటగాడు ఏక్నాథ్ సోల్కర్ 26 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు. రెండో టెస్ట్‌లో రహానే ఏకంగా ఐదు క్యాచ్‌లు అందుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.