: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు చలపతిరావు కేసు బదిలీ
ఓ సినిమా వేడుకలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు చలపతిరావుపై నమోదైన కేసును హైదరాబాదు, చాదర్‌ఘాట్ పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మే 18న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన చలపతిరావు యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.
సీనియర్ నటుడైన ఆయన మహిళలను కించపరిచేలా మాట్లాడారని, చలపతిరావు వ్యాఖ్యలతో మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. చలపతి రావు వ్యాఖ్యలపై అదే రోజు చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఘటన జరిగింది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ ప్రారంభించారు.