: ఆ రోజు అందర్నీ నేను చూసే వాడిని.. ఈ రోజు నన్ను కూడా కొంతమంది చూస్తున్నారు: దర్శకుడు కృష్ణవంశీ


నాడు లైట్ మెన్ గా తన కెరీర్ ప్రారంభించిన కృష్ణవంశీ దర్శకుడి స్థాయికి ఎదిగి తానేంటో నిరూపించుకున్న విషయం ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. కాగా, కృష్ణవంశీ తెరకెక్కించిన నక్షత్రం చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ కు తాజాగా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ‘నాటికి, నేటికీ మీలో మీరు గమనించుకున్న మార్పులు ఏమిటి?’ అని ప్రశ్నించగా.. ‘ఆ రోజు అందర్నీ నేను చూసే వాడిని .. ఈ రోజు కొంతమంది నన్ను కూడా చూస్తున్నారు. ఇంతే తేడా. ఇంతకుమించి చెప్పాలంటే, కొంచెం వయసు పెరిగింది .. పెళ్లి అయింది.. ఓ కొడుకు ఉన్నాడు. అప్పుడు రోడ్డుపై నడిచి తిరిగే వాడిని, భోజనానికి కూడా డబ్బులు ఉండేవి కాదు.. ఇప్పుడలా కాదు. అప్పటికీ, ఇప్పటికీ నా లోపల అయితే ఏం తేడా లేదు, అలానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News