: దేశం కోసం టైటిల్ ని వెనక్కి ఇచ్చేస్తానంటున్న బాక్సర్ విజేందర్ సింగ్
నిన్న రాత్రి ముంబైలో జరిగిన బౌట్ లో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటయాలినినీ భారత బాక్సర్ విజేందర్ సింగ్ మట్టి కరిపించిన విషయం తెలిసిందే. అయితే, చైనా, భారత్ మధ్య ఉన్న డోక్లామ్ సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా తన టైటిల్ ను వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమంటూ విజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, డోక్లామ్ సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఆశిస్తున్నానని, తన టైటిల్ ను ఇచ్చేందుకు సిద్ధమని, ఈ టైటిల్ చైనా ప్రజలకు, అక్కడి మీడియాకు చేరుతుందని ఆశిస్తున్నానని అన్నాడు. కాగా, ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ ను విజేందర్ సింగ్ నిన్న కైవసం చేసుకున్నాడు.