: బాలకృష్ణ కు స్టంట్ డ్రైవర్ అక్కర్లేదంటున్న ‘పైసా వసూల్’ యూనిట్


పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అగ్రహీరో బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘పైసా వసూల్’. ఈ సినిమాలోని ఓ ఫైటింగ్ సీన్ నిమిత్తం బాలకృష్ణ డూప్ లేకుండా నటించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ‘పైసా వసూల్’ చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. స్టంట్స్ చేసే సమయంలో కారులో బాలకృష్ణ పక్కన శ్రియ కూడా కూర్చొని ఉంది. అయితే, ఈ షాట్ పూర్తయిన తర్వాత కారులో నుంచి కిందకు దిగిన శ్రియ ఆశ్చర్యపోవడమే కాదు, ‘వామ్మో!’ అనే ఎక్స్ ప్రెషన్ ఇచ్చిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇక, ఈ వీడియోపై చిత్రయూనిట్ ఏమంటోందంటే..‘ 57 ఏళ్ల వయసులో ఓ బాస్ లా రిస్కీ స్టంట్స్ చేయడం ఆయనకే చెల్లింది. ఫైట్స్ సమయంలో నందమూరి బాలకృష్ణకు స్టంట్ డ్రైవర్ అవసరం లేదు’ అని పేర్కొంది.

  • Loading...

More Telugu News