: నేను డ్యాన్స్ బాగా చేస్తున్నానని చాలా మంది చెబుతున్నారు: హీరోయిన్ కేథరిన్
తాను సినిమాల్లోకి వచ్చిన మొదట్లో తనకు డ్యాన్స్ చేయడం అసలు రాదని, ఆ తర్వాత నుంచి ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుని డ్యాన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నానని హీరోయిన్ కేథరిన్ చెప్పింది. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేథరిన్ మాట్లాడుతూ, తాను కాలేజీలో చదువుకునే రోజుల్లోనే కన్నడలో ఓ సినిమా చేశానని, అప్పుడు డ్యాన్స్ చేయడం తనకు అసలు రాదని, ఆ తర్వాత దీనిపై బాగా దృష్టి పెట్టానని చెప్పింది.
తాను డ్యాన్స్ బాగా చేస్తున్నానని ఇప్పుడు చాలా మంది చెబుతున్నారని తెలిపింది. తెలుగులో గతంలో విడుదలైన పైసా చిత్రంలో నటించేందుకు తాను చాలా కష్టపడ్డానని, కేవలం, ఎక్స్ ప్రెషన్స్ తోనే నటించాల్సి వచ్చిందని చెప్పింది. తాజాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'జయ జానకీ నాయక' చిత్రంలో ఓ పాటలో నటించానని చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటానని కేథరిన్ చెప్పింది.