: ఒక తాటిపైకి రానున్న ములాయం, లాలూ, శరద్ యాదవ్!
దేశ రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న ముగ్గురు కీలక నేతలు ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ లు ఒకే తాటిపైకి రానున్నారు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు వీరు ముగ్గురు కలసి ఓ రాజకీయ వేదికను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ త్రిమూర్తుల కలయిక 2019 సాధారణ ఎన్నికల్లో ఎన్డీయే విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే లాలూ, శరద్ లతో ములాయం సింగ్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఫాసిస్టు శక్తులపై పోరాడేందుకు తమతో చేతులు కలపాలని శరద్ యాదవ్ ను ఇప్పటికే లాలూ కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు, వీరు ముగ్గురూ ఏకం కావడం కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందిని కలిగిస్తోంది. కాంగ్రెస్ తో జతకట్టేందుకు ములాయం సింగ్ ససేమిరా అంటున్నారు.