: ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం


చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దగ్ధం చేశారు. గుజరాత్ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ కారుపై జరిగిన దాడిని ఖండిస్తూ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చిత్రపటాలను కూడా తగులబెట్టారు. సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లిన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కారణంగా అరగంటకు పైగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. 

  • Loading...

More Telugu News