: రైవస్ కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందానికి దొరికిన సూర్యకుమారి మృతదేహం!
ఐదురోజుల క్రితం విజయవాడలో అదృశ్యమైన డాక్టర్ సూర్యకుమారి మృతదేహం దొరికినట్లు పోలీసులు స్పష్టం చేశారు. రైవస్ కాలువ ఒడ్డున సూర్యకుమారి స్కూటీని చూసినట్లు స్థానికులు చెప్పిన సమాచారం మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందం కాలువలో గాలింపు ప్రారంభించారు. 27 మంది ప్రత్యేక బృందం కలిసి 14 కిలోమీటర్ల మేర గాలించి సూర్యకుమారి మృతదేహాన్ని వెలికితీశారు. సూర్యకుమారిది ఆత్మహత్యే అని పోలీసులు నిర్థారించారు. ఐదు రోజుల నుంచి నీళ్లలో ఉండటం వల్ల మృతదేహం గుర్తుపట్టలేకుండా మారిపోవడంతో తమ కూతురిని ఆ రకంగా చూడలేక సూర్యకుమారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.