: హీరానంద్ కటారియా, సత్యనారాయణ్‌లకు ద్రోణాచార్య అవార్డ్?
కబడ్డీ కోచ్ హీరానంద్ కటారియా, పారాలింపిక్స్ కోచ్ సత్యనారాయణ్‌ల పేర్లను క్రీడా శిక్షకులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ద్రోణాచార్య అవార్డుకు కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వీరిరువురితో పాటు అథ్లెటిక్స్ శిక్షకుడు డా. ఆర్. గాంధీ పేరును కూడా మరణానంతరం ఈ అవార్డుకు సిఫారసు చేసినట్లు సమాచారం. అదే విధంగా జీవిత సాఫల్య పురస్కారానికి బ్యాడ్మింటన్ కోచ్ జీఎస్ఎస్‌వీ ప్రసాద్, బాక్సింగ్ శిక్షకులు బ్రిజ్ మోహంతీ, హాకీ కోచ్ పీఏ రఫెల్, షూటింగ్ కోచ్ సంజయ్ చక్రవర్తిల పేర్లను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ధ్యాన్‌చంద్ అవార్డుకు భూపీందర్ సింగ్ (అథ్లెటిక్స్), సయీద్ షాహిద్ హకీం (ఫుట్‌బాల్), సుమ్‌రాయ్ టెటె (మహిళల హాకీ)లను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.