: చిరంజీవితో సెల్ఫీ దిగిన టీఆర్ఎస్ ఎంపీ కవిత!


కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ అగ్రహీరో చిరంజీవితో టీఆర్ఎస్ ఎంపీ కవిత సెల్ఫీ దిగారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే నిమిత్తం ఈ ఇద్దరు ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. తమ ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో ఎంపీ కవిత సరదాగా ఓ సెల్ఫీ దిగారు. ఈ ఫొటోను ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కవిత దిగిన మరో సెల్ఫీలో చిరంజీవి, టీడీపీ ఎంపీ మాగంటి బాబు కూడా ఉన్నారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు హక్కును ఉపయోగించుకున్న అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశానుసారం ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడికి ఓటు వేశామని చెప్పారు. వెంకయ్యనాయుడు గెలుపు తథ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News