: పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయి: ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్
పది రూపాయల నాణేలు చెల్లడం లేదు అంటూ వస్తున్న పుకార్లపై ఆర్బీఐ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యన్ స్పష్టతనిచ్చారు. పది రూపాయి నాణేలు చలామణి అయ్యేలా చూడాలని ఆయన బ్యాంకు అధికారులను ఆదేశించారు. పది రూపాయి నాణేలు చెల్లడం లేదని, ఎవరైనా తీసుకోకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ విషయంపై ఏదైనా బ్యాంకులో సమస్యలు ఏర్పడితే ఆర్బీఐకి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.