: వెంకయ్యా?.. గాంధీనా? ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే.. సాయంత్రం ఫలితాలు!


భారత 15వ ఉప రాష్ట్రపతి ఎన్నిక మరో గంటలో ప్రారంభం కానుంది. సాయంత్రం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్డీఏ పక్షాల నుంచి వెంకయ్యనాయుడు పోటీలో ఉండగా, ప్రతిపక్షాల అభ్యర్థిగా మహాత్మాగాంధీ మనవడు గోపాల్‌కృష్ణ గాంధీ పోటీపడుతున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నిక జరగనుంది. ఎన్నిక కోసం ప్రత్యేక కలాలు సిద్ధం చేశారు.

ఇటీవల ‘మహాగట్బంధన్’తో తెగదెంపులు చేసుకుని ఎన్డీఏతో కలిసి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ తమ ఓటు గాంధీకేనని తేల్చి చెప్పింది. కాగా, లోక్‌సభలో ఎన్డీయేకు అత్యధిక మెజారిటీ ఉండడంతో వెంకయ్య గెలుపు ఖాయమని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News