: సినిమాల్లో నటించు.. కానీ షరతులు వర్తిస్తాయి!: కూతురికి అమృతా సింగ్ హెచ్చరిక


బాలీవుడ్ స్టార్ సైఫ్‌ అలీ ఖాన్‌, అమృతా సింగ్ ల కుమార్తె సారా అలీ ఖాన్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైంది. సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్‌ సరసన 'కేదార్‌ నాథ్' సినిమాలో ఆమె నటించనుంది. ఈ నేపథ్యంలో సారాకు ఆమె తల్లి షరతులు విధించినట్టు తెలుస్తోంది. మొదట్లో ఆమె సినీ రంగప్రవేశానికి అభ్యంతరం చెప్పిన ఆ దంపతులు, లిమిట్స్ దాటనంటూ సారా హామీ ఇవ్వడంతోనే, కొన్ని షరతులతో సరే అన్నట్టు తెలుస్తోంది.

ఇక ఆ షరతులు వివరాల్లోకి వెళ్తే... షూటింగ్‌ ల పేరు చెప్పి హీరోలు, బాయ్‌ ఫ్రెండ్స్‌ అంటూ తిరగకూడదు. కేవలం సినిమాకు సంబంధించిన వార్తల్లో ఉండాలే తప్ప ఇతర విషయాలతో వార్తల్లో నిలవకూడదు. వాళ్లతోను, వీళ్లతోనూ ఫోటోలు దిగుతూ, బయట తిరుగుతూ వార్తల్లో నిలవకూడదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆ సినిమా డైరెక్టర్ అభిషేక్ కపూర్‌ ను కలిసి, తన కుమార్తెను అసభ్యంగా చూపించవద్దని అమృతా కోరిందట. తమ కుమార్తెకు నటనలో మెలకువలు కూడా నేర్పించాలని కోరింది. కాగా, సారాను ఇప్పటికే బాలీవుడ్ ప్రిన్సెస్ గా పిలుచుకుంటున్నారు. ఆమె పటౌడీ రాజకుటుంబానికి చెందినదన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News