: వైట్‌హౌస్‌కు 17 రోజులపాటు ట్రంప్ దూరం.. పునరుద్ధరణ పనులే కారణం!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 17 రోజులపాటు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు దూరంగా ఉండనున్నారు. సిబ్బంది కూడా మరో భవనానికి మారనున్నారు. అధ్యక్ష భవనంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండడమే ఇందుకు కారణం. ట్రంప్ శుక్రవారమే ‘వర్కింగ్ వెకేషన్’ కోసం న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్‌కు చేరుకున్నారు. భవనం మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు ఆయన అక్కడే వుంటారు. ట్రంప్ సిబ్బంది మాత్రం ఈజెన్‌హోవర్‌లోని ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనానికి చేరుకున్నారు. శ్వేతసౌధంలోని వెస్ట్‌వింగ్‌లో ఇప్పటికే పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. 27 ఏళ్ల పాతదైన ఈ బిల్డింగ్‌లో వెంటిలేషన్, ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్టు శ్వేతసౌధం అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News