: ‘నక్షత్రం’కు వెళ్లిన ప్రేక్షకులు నక్షత్రాలు చూస్తున్నారు!: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన మల్టీస్టారర్ చిత్రం ‘నక్షత్రం’ ఈ రోజు విడుదలైంది. ఈ సందర్భంగా మరో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘నక్షత్రం సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులు నక్షత్రాలను చూస్తున్నారు. అభినందనలు వంశీ, నా లాగానే నువ్వు కూడా సరైన మార్గంలో ఉన్నావు..’ అని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో పాటు ‘నక్షత్రం’ పోస్టర్ ను కూడా పోస్ట్ చేశారు. కాగా, సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, తనీష్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజు, బ్రహ్మాజీ తదితరులు ఈ చిత్రంలో నటించారు.