: కాంగ్రెస్ వేసిన కేసులపై త్వరలో ఓ పుస్తకం విడుదల చేస్తాం: మంత్రి హరీశ్ రావు


తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఎన్నో కేసులు వేశారని, చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ దని, ఈ కేసులపై త్వరలో ఓ పుస్తకం విడుదల చేస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆవేదన ప్రతిపక్షాలకు అహంకారంగా కనిపిస్తోందని, కాంగ్రెస్ పాలనలో నాడు ఆంధ్రాకు అక్రమంగా నీళ్లు తరలిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతల పౌరుషం ఏమైందని ఆయన ప్రశ్నించారు.

నాడు పులిచింతల ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి మరీ కట్టించారని, ఈ విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. ‘చిల్లర మాటలు మాట్లాడటం, చిల్లర రాజకీయాలు చేయడం మా పార్టీ చరిత్రలో లేవు. వచ్చే ఎన్నికల్లో మీరేమిటో, మేమేమిటో ప్రజలే తేలుస్తారు’ అని హరీశ్ రావు అన్నారు.

  • Loading...

More Telugu News