: `ఓ మై గాడ్` తమిళ రీమేక్‌లో కమలహాసన్, మోహన్‌లాల్?
తెలుగులో `గోపాల గోపాల`గా విడుదలైన హిందీ చిత్రం `ఓ మై గాడ్`ను తమిళంలో రీమేక్ చేయడానికి విలక్షణ నటుడు కమలహాసన్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఆయనతో పాటు మలయాళ నటుడు మోహన్‌లాల్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో విక్టరీ వెంకటేశ్, హిందీలో పరేశ్ రావల్ చేసిన పాత్రను కమల్ చేస్తారని, పవన్ కల్యాణ్, అక్షయ్ కుమార్‌లు పోషించిన దేవుడి పాత్రను మోహన్ లాల్ చేస్తారని కోలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గతంలో హిందీ చిత్రం `ఎ వెడ్నెస్ డే` ఆధారంగా తమిళంలో రీమేక్ అయిన `ఉన్నైపోల్ ఒరువన్ (తెలుగులో `ఈనాడు`)` చిత్రంలో కమల్, మోహన్‌లాల్ కలిసి నటించారు. ఇదే చిత్రంలో తెలుగులో కమల్‌తో పాటు విక్టరీ వెంకటేష్ నటించిన సంగతి తెలిసిందే!